కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారుజామునే దారుణం జరిగింది. వాకింగ్ కి వెళ్లిన తండ్రి, కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. యువకుడు హర్షవర్ధన్ కు ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ కు ఎల్లుండి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో దాడి జరగడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమా లేకుంటే, పాత కక్షల నేపథ్యంలో దాడికి పాల్పడ్డారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.