Dangerous Android Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. ఇక అంతే..!

| Edited By:

Feb 14, 2020 | 2:19 PM

Dangerous Android Apps: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండడం అనేది అసాధ్యం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కొన్ని యాప్స్ మీకు తెలియకుండానే మీ కదలికల్ని నిరంతరం గమనిస్తుంటాయి. యాప్ డౌన్‌లోడ్ తర్వాత ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఇచ్చే పర్మిషన్స్‌ను ఆసరాగా చేసుకుని యూజర్ల డేటాని దొంగిలించేస్తున్నాయి. కాంటాక్స్ దొంగిలించి, వాటంతటమే ఫోన్ కాల్స్ చేసేస్తున్నాయి ఆ యాప్స్. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, యూజర్‌కి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి పనులు […]

Dangerous Android Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. ఇక అంతే..!
Follow us on

Dangerous Android Apps: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండడం అనేది అసాధ్యం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కొన్ని యాప్స్ మీకు తెలియకుండానే మీ కదలికల్ని నిరంతరం గమనిస్తుంటాయి. యాప్ డౌన్‌లోడ్ తర్వాత ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఇచ్చే పర్మిషన్స్‌ను ఆసరాగా చేసుకుని యూజర్ల డేటాని దొంగిలించేస్తున్నాయి. కాంటాక్స్ దొంగిలించి, వాటంతటమే ఫోన్ కాల్స్ చేసేస్తున్నాయి ఆ యాప్స్. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, యూజర్‌కి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి పనులు చేస్తూ నిరంతరం నిఘా పెడుతున్నాయి. యూజర్లకు ప్రమాదకరంగా మారిన కొన్ని యాప్‌ల గురించి ఓ సంస్థ అలర్ట్ చేయడంతో ఇటీవలే గూగుల్.. ప్లే స్టోర్‌ నుంచి వాటిని తొలగించింది. వాటిలో ఎక్కువగా బ్యాటరీ సేవర్, గేమింగ్, వైరస్ స్కాన్ యాప్స్ ఉన్నాయి.

మీ ప్రతి కదలికల్ని రహస్యంగా రికార్డ్ చేసేస్తున్న 24 యాప్స్‌ను ఇటీవల వీపీఎన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ వీపీఎన్ ప్రో హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఆ యాప్స్‌ను 38 కోట్ల మందికిపైగా తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్నారని అంచనా. సో వెంటనే ఆ యాప్స్‌ను డిలీట్ చేసుకుని ఫోన్‌లోని విలువైన డేటా ఇకనైనా చోరీకి గురవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యాప్స్ ఏవంటే..

1) World Zoo
2) Word Crush
3) Word Crossy
4) Weather Forecast
5) Virus Cleaner 2019
6) Turbo Power
7) Super Cleaner
8) Super Battery
9) Sound Recorder
10) Soccer Pinball
11) Puzzle Box
12) Private Browser
13) Net Master
14) Music Roam
15) Laser Breaker
16) Joy Launcher
17) Hi VPN , Free VPN
18) Hi VPN Pro
19) Hi Securities 2019
20) File Manager
21) Dig it
22) Candy Selfie Camera
23) Candy Gallery
24) Calendar Lite