గూగుల్, ఆపిల్ ఎమిరేట్స్ కు చెందిన మెసేజింగ్ యాప్ టోటోక్ ను తమ అప్లికేషన్ స్టోర్స్ నుండి తొలగించాయి.ఈ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ వినియోగదారుల సమాచారాన్ని యుఎఇ ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు సమాచారం. మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్, వినియోగదారుల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ తన విధానాలను ఉల్లంఘిస్తోందని గూగుల్ ఆరోపించినప్పటికీ, ఆపిల్ ఈ దావాపై ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మెసేజింగ్ యాప్ యజమానికి అబుదాబికి చెందిన హ్యాకింగ్ కంపెనీ డార్క్ మ్యాటర్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది, ప్రస్తుతం ఇది ఎఫ్‌బిఐ దర్యాప్తులో ఉంది.