ఇన్స్యూరెన్స్ పాలసీదారులకు శుభవార్త‌

| Edited By:

Mar 15, 2019 | 6:53 PM

ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. 22 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందుకు కారణం ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ మరణాల రేటుకు సంబంధించిన కొత్త డేటా ఫాలో కావడమే. ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇకపై 2012-2014 నాటి మరణాల రేటు బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. ఈ డేటాను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ […]

ఇన్స్యూరెన్స్ పాలసీదారులకు శుభవార్త‌
Follow us on

ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. 22 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందుకు కారణం ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ మరణాల రేటుకు సంబంధించిన కొత్త డేటా ఫాలో కావడమే.

ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇకపై 2012-2014 నాటి మరణాల రేటు బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. ఈ డేటాను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఇన్స్యూరెన్స్ ప్రీమియం తీసుకుంటున్న 22 నుంచి 50 ఏళ్ల వయస్సువారి మరణాల రేటు 4 నుంచి 16 శాతం తగ్గింది. దీంతో ఇన్స్యూరెన్స్ ప్రీమియం కూడా తగ్గనుంది. అయితే 50 ఏళ్లు పైబడి ఉన్నవారి ప్రీమియంలో ఎలాంటి మార్పు ఉండదు