Hyderabad: అందుకే నరికి చంపాం.. పట్టపగలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ హత్యోదంతంలో షాకింగ్ నిజాలు

హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో తన పాస్‌పోర్ట్ విడిపించడం లేదనే కత్తితో నరికి చంపానని నిందితుడు పోలీసుల ముందు

Hyderabad: అందుకే నరికి చంపాం.. పట్టపగలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ హత్యోదంతంలో షాకింగ్ నిజాలు
Old City Murder
Follow us

|

Updated on: Oct 16, 2021 | 1:09 PM

Hyderabad Old City Murder Case: హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో తన పాస్‌పోర్ట్ విడిపించడం లేదనే కత్తితో నరికి చంపానని నిందితుడు పోలీసుల ముందు వెల్లడించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, తనతో కిలో బంగారాన్ని దుబాయ్​ నుంచి హైదరాబాద్​కు అక్రమంగా రవాణ చేయించడంతో పాటు సీజ్​ చేసిన పాస్​ పోర్టును విడిపించడంలో జాప్యం చేస్తున్న వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర పన్నాడు ఆదిల్ జాఫ్రి. బుధవారం సాయంత్రం కారులో వెళ్తున్న హామిద్​ బిన్​ అల్​ జుబేదిని అడ్డగించిన ఆదిల్​ జాఫ్రితో పాటు మరో ముగ్గురు కత్తులతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్​ కు చెందిన హామిద్​ బిన్​ అల్​ జుబేది(37) మీలినియం ట్రావెల్స్​, వెస్టన్​ యూనియన్​ మనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆదిల్​ జాఫ్రి.. ఇద్దరూ స్నేహితులు. 2019లో దుబాయ్​ నుంచి వస్తున్న ఆదిల్​ జాఫ్రికి అక్కడి నుంచి కిలో బంగారాన్ని హైదరాబాద్​కు వచ్చేటప్పుడు తీసుకురమ్మని హామిద్​ బిన్​ అల్​ జుబేది చెప్పాడు. కిలో బంగారానికి సంబంధించిన డబ్బులు కూడా అప్పట్లో ట్రాన్స్​ఫర్​ చేశాడు హామిద్​ బిన్​ అల్​ జుబేది.

అయితే, కిలో బంగారం తీసుకుని వస్తున్న ఆదిల్​ జాఫ్రిని ఎయిర్​పోర్టు అధికారులు పట్టుకుని, అక్రమ బంగారం రవాణా కింద కేసులు నమోదు చేసి పాస్​పోర్టును సీజ్​ చేశారు. అప్పటి నుంచి వారిరువురి మధ్య పాస్​ పోర్టు విషయంలో విభేధాలు తలెత్తాయి. తాను మళ్లీ దుబాయ్​కు వెళ్లాళని తన పాస్​ పోర్టు తనకు ఇప్పించాలని హామిద్​ బిన్​ అల్​ జుబేది పై ఆదిల్​ జాఫ్రి తీవ్ర ఒత్తిడి చేయసాగాడు. దీంతో.. కోర్టులో కేసు నడుస్తుందని, ఆదిల్​ జాఫ్రి ఖర్చుల నిమిత్తం వచ్చినప్పుడల్లా డబ్బులు ముట్టజెప్పేవాడు. అయినా వారి మధ్య విభేధాలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం హా మిద్​ బిన్​ అల్​ జుబేది బండ్లగూడ హాషమాబాద్​ ప్రాంతంలో కారులో వెళ్తుండగా ఆదిల్​ జాఫ్రి, సయీద్​ జాఫ్రి, రయీస్​ జాఫ్రి, సాహెద్​ జాఫ్రిలతో కలిసి అడ్డగించి కత్తులతో విచక్షణ రహితంగా నడి రోడ్డుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హామిద్​ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

123

Read also: Sasikala: జయలలిత సమాధి వద్ద శశికళ భావోద్వేగం.. అమ్మను తలచుకుంటూ కంట తడిపెట్టిన చిన్నమ్మ

Latest Articles