డాలర్‌ బలోపేతంతో ధర తగ్గిన బంగారం

|

Sep 03, 2020 | 6:21 PM

మొన్నటి వరకు బెట్టు చేసిన బంగారం నెమ్మదిగా మెట్టు దిగుతోంది.. రయ్యిమంటూ దూసుకుపోయిన పసిడి ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.. ఇవాళ కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో..

డాలర్‌ బలోపేతంతో ధర తగ్గిన బంగారం
Follow us on

మొన్నటి వరకు బెట్టు చేసిన బంగారం నెమ్మదిగా మెట్టు దిగుతోంది.. రయ్యిమంటూ దూసుకుపోయిన పసిడి ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.. ఇవాళ కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఒడిదుడుకులతో సాగడంతో ధరలు కాసింత తగ్గాయి.. ఎంసీఎక్స్‌లో తులం బంగారం ధర 50 రూపాయలు తగ్గింది.. కిలో వెండి కూడా 524 రూపాయలు తగ్గింది.. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర 50,771 రూపాయలుగా ఉంటే, కిలో వెండి ధర 65, 260 రూపాయలు పలుకుతోంది.. మొన్నటి వరకు ముదుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు.. ఇప్పుడు డాలర్‌ బలపడటంతో కరెన్సీలో, షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.. బంగారం ధర తగ్గడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు..