గ్రేటర్ ఎన్నికల సమరం మొదలైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ఇప్పటికే ఓటర్లు ఒకరి తర్వాత మరొకరు తమ ఓటు హక్కును నియోగించుకుంటున్నారు. కాగా, బల్దియా ఎన్నికల ద్వారానే మొట్టమొదటి సారిగా ఓటువేసిన యువత తమ అనుభవాన్ని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.
ఓటు వేయటం అంటే..అది మనహక్కుగా చెబుతున్నారు. వాళ్ల రైట్స్ వాళ్లు పొందాలంటే ఖచ్చితంగా ఓటు వేయాలంటున్నారు. ఫస్టటైమ్ ఓటు వేయటం పట్ల ఉత్సహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ ద్వారా ఓటు హక్కువినియోగించిన యువత..వచ్చే ఎన్నికల్లో ఈవీఎం ద్వారా ఓటు వేస్తామంటున్నారు.