ఇటలీలోని భారీ వంతెనను కూల్చేశారు..!

ఇటలీలోని భారీ వంతెనను ఇంజనీర్లు కూలగొట్టారు. ఇటాలియన్ పోర్ట్ సిటీలోని జెనోవాలో ఉన్న మొరండి బ్రిడ్జిలో గతేడాది కొంతభాగం కూలడంతో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. 70 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి కావడంతో అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన 10 నెలల తర్వాత బ్రిడ్జ్‌ను పూర్తిగా కూల్చేశారు. బ్రిడ్జి అడుగు భాగంలో శక్తివంతమైన డిటోనేటర్లు అమర్చి పేల్చి వేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టు […]

ఇటలీలోని భారీ వంతెనను కూల్చేశారు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2019 | 10:53 AM

ఇటలీలోని భారీ వంతెనను ఇంజనీర్లు కూలగొట్టారు. ఇటాలియన్ పోర్ట్ సిటీలోని జెనోవాలో ఉన్న మొరండి బ్రిడ్జిలో గతేడాది కొంతభాగం కూలడంతో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. 70 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి కావడంతో అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన 10 నెలల తర్వాత బ్రిడ్జ్‌ను పూర్తిగా కూల్చేశారు. బ్రిడ్జి అడుగు భాగంలో శక్తివంతమైన డిటోనేటర్లు అమర్చి పేల్చి వేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టు పక్కల భవనాల్లో ఉంటున్న సుమారు 4వేల మందిని ఖాళీ చేయించారు అధికారులు. బ్రిడ్జ్‌ను కూల్చిన వెంటనే వెలువడే దుమ్ము చుట్టుపక్కల వ్యాపించకుండా పెద్ద ఎత్తున నీళ్ల ట్యాంకులను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్ కింద సుమారు 4,500 టన్నుల కాంక్రీటు, స్టీలు కలిగి ఉండే రెండు టవర్లను కూడా పేలుడు పదార్థాల సాయంతో పేల్చేశారు. మొత్తం 8 సెకన్ల వ్యవధిలో బ్రిడ్జ్ మొత్తం పూర్తిగా కూలిపోయింది.