కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగు ప్రత్యేక సబ్ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా...

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!

Updated on: Aug 22, 2020 | 2:10 PM

New Districts Formation AP: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగు ప్రత్యేక సబ్ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి బాధ్యతలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఙారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీ, సబ్ కమిటీల సహాయం కోసం జిల్లాస్థాయి కమిటీలు ఉండగా.. పది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. వివిధ రాష్ట్రలలో జిల్లా పునర్విభజనపై అధ్యాయం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యాయానికి సబ్ కమిటీ 1 ఏర్పాటు కాగా, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యాయన బాధ్యతలు సబ్ కమిటీ 2 చూడనుంది. ఇక మౌలిక సదుపాయాలు, ఆస్తులపై సబ్ కమిటీ 3 అధ్యయనం చేయనుండగా.. ఐటీ సంబంధిత వ్యవహారాలపై అధ్యాయానికి సబ్ కమిటీ 4ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈఓ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..