రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన క్రీడాకారులు, పురస్కారాలు వాపసు చేయాలని నిర్ణయం .

|

Dec 05, 2020 | 11:59 AM

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న రైతులకు ప్రముఖ క్రీడాకారుల నుంచి కూడా మద్దతు లభించింది. ఇవాళ కేంద్ర మంత్రులతో రైతు నాయకులు జరిపే చర్చలు కనుక విఫలమైతే తమకు దక్కిన పురస్కారాలు,

రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన క్రీడాకారులు, పురస్కారాలు వాపసు చేయాలని నిర్ణయం .
Follow us on

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న రైతులకు ప్రముఖ క్రీడాకారుల నుంచి కూడా మద్దతు లభించింది. ఇవాళ కేంద్ర మంత్రులతో రైతు నాయకులు జరిపే చర్చలు కనుక విఫలమైతే తమకు దక్కిన పురస్కారాలు, తమకు లభించిన పతకాలను వెనక్కి ఇచ్చేయాలని క్రీడాకారులు నిర్ణయించారు. హాకీ మాజీ కెప్టెన్‌ పరగత్‌సింగ్‌ తన పద్మశ్రీ పురస్కారాన్ని వాపసు చేస్తానని చెప్పారు. మరో పద్మశ్రీ పురస్కార గ్రహీత కర్తార్‌ సింగ్‌ కూడా ఇదే మాటమీద నిలిచారు. అర్జున అవార్డు గ్రహీతలు సజ్జన్‌సింగ్‌ చీమా, రాజ్‌బీర్‌ కౌర్‌, ఒలింపిక్‌ పతక గ్రహీత గుర్మయిల్‌ సింగ్‌, మాజీ క్రికెట్‌ కోచ్‌ రాజీందర్‌సింగ్‌లు కూడా తమ పురస్కారాలను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. బాక్సింగ్‌ మాజీ కోచ్‌ గుర్బక్ష్‌ సింగ్‌ సంధు కూడా తన ద్రోణాచార్య పురస్కారాన్ని వాపసు చేయనున్నట్లు చెప్పారు.