శుభ్‌మన్‌ గిల్‌ ఓ రౌడీ.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

|

Jan 05, 2020 | 11:19 AM

కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెర్సస్ పంజాబ్ మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌‌ను ఎవ్వరూ అప్పుడే మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ ఆన్ ఫీల్డ్ అంపైర్‌ను దూషించడమే కాకుండా తన అనుచిత ప్రవర్తనతో సహచర ఆటగాళ్లకు కూడా విసుగు తెప్పించాడు. గిల్ 10పరుగుల వద్ద సుబోధ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దాన్ని అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ .. గిల్ క్రీజు వదిలి వెళ్లకుండా డెసిషన్‌ను రివర్స్ చేసుకుని మళ్ళీ బ్యాటింగ్ ఆరంభించాడు. దీంతో పంజాబ్ ఆటగాళ్లు మ్యాచ్‌ను […]

శుభ్‌మన్‌ గిల్‌ ఓ రౌడీ.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Follow us on

కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెర్సస్ పంజాబ్ మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌‌ను ఎవ్వరూ అప్పుడే మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ ఆన్ ఫీల్డ్ అంపైర్‌ను దూషించడమే కాకుండా తన అనుచిత ప్రవర్తనతో సహచర ఆటగాళ్లకు కూడా విసుగు తెప్పించాడు. గిల్ 10పరుగుల వద్ద సుబోధ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దాన్ని అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ .. గిల్ క్రీజు వదిలి వెళ్లకుండా డెసిషన్‌ను రివర్స్ చేసుకుని మళ్ళీ బ్యాటింగ్ ఆరంభించాడు. దీంతో పంజాబ్ ఆటగాళ్లు మ్యాచ్‌ను బహిష్కరించడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనిపై స్పందించాలంటూ బిషన్ బేడీని ట్విట్టర్ ద్వారా ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

‘ఇండియా ఏ’ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడి దగ్గర నుంచి ఇలాంటి రౌడీ ప్రవర్తన క్షమించరానిది. టాలెంట్ ఎంత ఉన్నా.. ఆట కంటే ఆటగాడు గొప్ప వ్యక్తి ఏమి కాదు. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయకముందే అతడిని ఇండియా ఏ కెప్టెన్‌గా తొలగించి.. సరైన ఆటగాడిని ఎంపిక చేయాలి. ఇది అందరికి ఒక హెచ్చరికలా ఉండాలని బిషన్ సమాధానమిచ్చాడు.

కాగా శుభ్‌మన్‌ గిల్.. న్యూజిలాండ్ సిరీస్‌కు ఇండియా ఏ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు నేరం చేసినట్లు రుజువైతే ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లెవెల్ 1 కింద కఠిన చర్యలు తప్పవు.

Refusing umpire decision and forcing him to reverse his verdict is a serious offence. The @BCCI needs to act and penalise the player so that a wrong precedent is not set. https://t.co/rgdnioMATT