ఉదయాన్నే ఖాళీ కడపుతో ఈ పదార్థాలు తింటే మీ ఆరోగ్యం సేఫ్.. మరీ అవెంటో తెలుసుకుందామా ?..

|

Dec 28, 2020 | 10:40 AM

ఉదయం లేవగానే ఖాళీ కడపుతో ఉంటున్నారా ? చాలా మందికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‏కు ముందు ఏం తినే అలవాటు ఉండదు.

ఉదయాన్నే ఖాళీ కడపుతో ఈ పదార్థాలు తింటే మీ ఆరోగ్యం సేఫ్.. మరీ అవెంటో తెలుసుకుందామా ?..
Follow us on

ఉదయం లేవగానే ఖాళీ కడపుతో ఉంటున్నారా ? చాలా మందికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‏కు ముందు ఏం తినే అలవాటు ఉండదు. రాత్రి సమయంలో దాదాపు ఎనిమిది గంటలు నిద్రపోతాము కాబట్టి ఆ తర్వాత పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో ఉంటారు. అయితే మనం లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తేనెలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదయం లేవగానే వేడినీళ్ళలో తేనె కలుపుకొని తాగితే జీవక్రియ పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. వీటితోపాటు నానబెట్టిన బాదం కూడా ముఖ్యమే. బాదంలో విటమిన్ ‘ఈ’తో పాటు మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఈ బాదంని నానబెట్టి ఉదయం లేవగానే పొట్టు తీసి తినాలి. ఇలా తింటే అందులో ఉండే విటమిన్లు శరీరానికి సరిగా చేరుతాయి. అలాగే కిస్మిన్ కూడా. కిస్మిస్‏లో ఉండే పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా నానబెట్టి తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే సహజ చక్కెర మన బాడీకి ఫుల్ ఎనర్జీని ఇస్తాయి. అంతే కాకుండా శరీరంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది. సాధరణంగా చాలా మంది ఇళ్ళలో బొప్పాయి చెట్టు ఉంటుంది. బొప్పాయి కూడా శరీరానికి చాలా చేస్తుంది. ఇది శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధించిన రోగాలను రాకుండా చూసుకుంటుంది. కాకపోతే ఉదయం ఈ బొప్పాయి తిన్నాక మినిమం గంట తర్వాత మాత్రమే రోజువారీ బ్రేక్ ఫాస్ట్ చేయాలి సుమా.