కారు ఇంజిన్ లో ప…ప..పాము !

| Edited By: Pardhasaradhi Peri

Nov 01, 2020 | 7:24 PM

ఫ్లోరిడాలోని ఓ నీలిరంగు కారు ఇంజిన్ లో దాక్కుని ఉందో బర్మీస్ పైథాన్ ! ఎందుకో అనుమానం వఛ్చి ఆ వాహన యజమాని చూస్తే ఏముంది ! సుమారు 10 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. షాక్ తిన్న ఆయన వెంటనే వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే  వారు.. రెండు స్టీల్ రాడ్స్ తో వచ్చి..దాన్ని ఒడుపుగా పట్టుకుని ఓ సంచీలో వేశారు. ఈ విధమైన కొండచిలువల జాతి చాలా అరుదని, ఈ వాహన […]

కారు ఇంజిన్ లో ప...ప..పాము !
Follow us on

ఫ్లోరిడాలోని ఓ నీలిరంగు కారు ఇంజిన్ లో దాక్కుని ఉందో బర్మీస్ పైథాన్ ! ఎందుకో అనుమానం వఛ్చి ఆ వాహన యజమాని చూస్తే ఏముంది ! సుమారు 10 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. షాక్ తిన్న ఆయన వెంటనే వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే  వారు.. రెండు స్టీల్ రాడ్స్ తో వచ్చి..దాన్ని ఒడుపుగా పట్టుకుని ఓ సంచీలో వేశారు. ఈ విధమైన కొండచిలువల జాతి చాలా అరుదని, ఈ వాహన యజమాని అప్రమత్తంగా లేకపోతే ఆయనపై దాడి చేసి ఉండేదని వారంటున్నారు. అసలు ఈ రకమైన పైథాన్ లో ఫ్లోరిడా లో కనిపించవని వారు పేర్కొన్నారు, ఇవి పక్షులు, స్తన్య జంతువులు, చివరకు మొసళ్లను సైతం ఆహారంగా స్వీకరిస్తాయని వారు చెబుతుంటే ఆ వాహన యజమాని విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు.