
ఈ మార్కెటింగ్ లో దూసుకుపోతున్న ఆమెజాన్ మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు సంబంధించి ఓ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. సిలిండర్ బుక్ చేసిన వెంటనే రూ. 50 తగ్గింపును పొందవచ్చని తెలిపింది. ఇందుకుగాను.. అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రూ. 50 వరకు ‘క్యాష్‌బ్యాక్’ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు అమెజాన్ వెబ్సైట్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తేనే రూ. 50 తగ్గింపు దక్కుతుంద వెల్లడించింది.
కాగా, ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సూచిస్తున్నారు అధికారులు. ఇండేన్ ఆయిల్ నవంబర్ ఒకటి నుంచి కొత్త గ్యాస్ బుకింగ్ నెంబర్ 77189 55555 ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నెంబర్ ద్వారా సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.