నవంబర్ 1న గురుకుల ప్రవేశ పరీక్ష

గిరిజన గురుకులాల పాఠశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు...

నవంబర్ 1న గురుకుల ప్రవేశ పరీక్ష

Updated on: Oct 22, 2020 | 5:36 PM

Gurukulam Entrance : గిరిజన గురుకులాల పాఠశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి నాగార్జున్‌రావు ప్రకటించారు.

ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులకు నవంబర్ 1 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో పూర్తి వివరాలు ఉంటాయని వెల్లడించారు. సకాలంలో పరీక్షకు హాజరు కావాలని వారు సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us