తొలి విడతలో 15 లక్షల నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తాం: మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

|

Nov 19, 2020 | 3:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడతగా 15 లక్షల ఇళ్లను నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చెప్పారు. లబ్ధిదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 26 వేల కోట్లతో, నాణ్యమైన మెటీరియల్ తో ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 1400 కోట్లు బకాయిలు పెట్టగా, వాటిని కూడా పేదలకు రెండు విడతల్లో విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు శ్రీరంగనాథ రాజు తెలిపారు. […]

తొలి విడతలో 15 లక్షల నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తాం: మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడతగా 15 లక్షల ఇళ్లను నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చెప్పారు. లబ్ధిదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 26 వేల కోట్లతో, నాణ్యమైన మెటీరియల్ తో ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 1400 కోట్లు బకాయిలు పెట్టగా, వాటిని కూడా పేదలకు రెండు విడతల్లో విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు శ్రీరంగనాథ రాజు తెలిపారు. పాదయాత్రలో పేదలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని సీఎం ఆదేశించారని చెరుకువాడ ఇవాళ విజయవాడలో తెలిపారు.