సరికొత్త రికార్డు సృష్టించిన‌ ఫాస్టాగ్… ఒక్క రోజులోనే రూ.80 కోట్లు వసూళ్లు.

దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం తాజాగా ఈ కొత్త విధానాన్ని తప్పనిసరి చేసింది. జనవరి 1వ తేదీ నుంచి...

సరికొత్త రికార్డు సృష్టించిన‌ ఫాస్టాగ్... ఒక్క రోజులోనే రూ.80 కోట్లు వసూళ్లు.

Updated on: Dec 25, 2020 | 9:12 PM

Fastag set new record: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం తాజాగా ఈ కొత్త విధానాన్ని తప్పనిసరి చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రకటన చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫాస్టాగ్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తాజాగా ఫాస్టాగ్ ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి.
గురువారం ఒక్క రోజే జరిగిన 50 లక్షల లావాదేవీల ద్వారా రూ.80 కోట్ల వసూళ్లు జరిగాయి. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు రావడం ఇదే తొలిసారని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద మొత్తంలో ఫాస్టాగ్ లావా దేవీలు జరగడం ఓ మైలురాయని ఎన్‌హెచ్‌ఏ‌ఐ అభివర్ణించింది.