జపాన్ తీరంలో భారీ భూకంపం..

భారీ భూకంపంతో జపాన్ వణికిపోయింది. శనివారం ఉదయం జపాన్ దేశంలోని చిచిజిమా సమీపంలోని దీవిలో భారీ భూకంపం సంభవించింది.

జపాన్ తీరంలో భారీ భూకంపం..
Earthquake

Updated on: Nov 07, 2020 | 7:16 PM

భారీ భూకంపంతో జపాన్ తీరం వణికిపోయింది. శనివారం ఉదయం జపాన్ దేశంలోని చిచిజిమా సమీపంలోని దీవిలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని నగరమైన టోక్యోకు 600 మైళ్ల దూరంలో ఉన్న ఒగాసవరా ద్వీపసమూహంలో భూకంపం వచ్చిందని ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోైదందని జపాన్ వాతావరణ శాఖ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. జపాన్ దేశం భూకంప క్రియాశీల జోన్ లో ఉంది. దీంతో ఇక్కడ తరచూ శక్తివంతమైన భూకంపాలు వస్తుంటాయి.2011లో 9.0 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ, ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రంలో విపత్తు సంభవించి సుమారు 15 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us