పాకిస్థాన్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్..

|

Aug 19, 2020 | 7:09 PM

పాకిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ మొదలు కానుంది.

పాకిస్థాన్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్..
Follow us on

England T20 Team: పాకిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ మొదలు కానుంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతుండగా.. ఇప్పటికే 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యం సాధించింది. వర్షం కారణంగా రెండో టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఆగష్టు 28 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్ కూడా బయో సెక్యూర్ బబుల్‌లోనే జరగనుంది. మోర్గాన్ సారధ్యం వహించనుండగా.. డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొట్టిన టామ్ బాంటన్, లూయిస్ గ్రెగొరీ, సాకిబ్ మహమూద్, డేవిడ్ మలన్ వంటి ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. ఇక ఈ టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించారు.

టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, టామ్ కర్రన్, జో డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, క్రిస్ జోర్డాన్, సాకిబ్ మహమూద్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ