
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను ఈసీ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఇందుకు పట్నాయక్, ఆయన సిబ్బంది పూర్తిగా సహకరించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం కోసం రూర్కేలాకు హెలికాప్టర్లో వచ్చారు. హెలిప్యాడ్ మీదకి చేరుకోగానే అక్కడే వేచి ఉన్న అధికారులు సీఎం హెలికాప్టర్లో ఉండగానే సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. బ్యాగులు, సూట్‌కేసులతో సహా సీఎం ఔషధాల పెట్టెను తనిఖీ చేశారు.