
లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాన మోదీ బయోపిక్ విడుదల పై ఇదివరకే ఆంక్షలు విధించిన ఈసీ ఆ క్రమంలోనే మరో చర్య తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్ ను తక్షణమే నిలిపివేయాలని నిర్మాణ సంస్థ ‘ఎరోస్ నౌ’ ను ఎన్నికల సంఘం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వెబ్ సిరీస్ ‘మోదీ-జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్’కి చెందిన ఐదు ఎపిసోడ్ లను తక్షణమే తొలగించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు గానూ ఈ వెబ్ సిరీస్ ప్రసారానికి అనుమతి ఇవ్వలేమని ఈసీ స్పష్టం చేసింది.
Breaking now! #ElectionCommission bans web series on Prime Minister Narendra Modi pic.twitter.com/rmEpNz6u4C
— Poulomi Saha (@PoulomiMSaha) April 20, 2019