ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక్కసారి అలజడి మొదలైంది. టోంగా సమీపంలో గురువారం భూకంపం సంభవించింది. గురువారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. లిఫుకా దీవులకు పశ్చిమాన పంగాయ్ గ్రామ సమీపంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. అయితే, సముద్ర తీరంలో భూకంపం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సునామీ వస్తుందేమోనని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే,ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. టోంగాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుడు సంభవిస్తుంటాయి.