
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో నెలవైన చిన వెంకన్న ఆలయ విమాన గోపురానికి త్వరలో బంగారు తాపడం ప్రక్రియ ప్రారంభం కానుంది. 2013 నుండి ఇప్పటివరకు ‘విమాన గోపుర స్వర్ణమయం’ పథకం పేరుతో భక్తుల నుంచి సేకరించిన విరాళాల వివరాలను దేవస్థానం ప్రకటించింది. ధన రూపంలో వచ్చిన విరాళాలు రూ. 3, 46,64,331/-, బంగారం 337 గ్రా 629 మి.గ్రా గా వెల్లడించింది. ఇక, అసలు క్రతువుకు నడుం బిగించి 2 కోట్ల 80 లక్షలతో బంగారు తాపడం మొదటి దఫా పనుల ఆమోదం నిమిత్తం దేవాదాయ కమిషనర్ కు దేవస్థానం నివేదిక పంపినట్టు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.