బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల టర్కీలో ఫస్ట్ లేడీ ఎమైన్ ఎర్డోగాన్ తో భేటీ కావడంపై ఆర్ ఎస్ ఎస్ మండిపడింది. ‘డ్రాగన్స్’ ఫేవరేట్ ఖాన్’ అంటూ నిప్పులు కక్కింది. ఇదే టైటిల్ తో తన పత్రిక ‘పాంచజన్య’ లో ఓ ఆర్టికల్ ని ప్రచురిస్తూ.. దేశ స్వాతంత్రోద్యమానికి ముందు. ఆ తరువాత కూడా బాలీవుడ్ సినిమాలు వచ్చాయని, కానీ మెల్లగా ఈ చిత్రాల్లోపాశ్చాత్య పోకడ ప్రభావం పెరిగిందని దుయ్యబట్టింది. టర్కీ ఫస్ట్ లేడీతో ఫోటోలు దిగడం ద్వారా ఆమిర్ ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకున్నాడని ఇందులో విమర్శించారు. ఆ దేశంలోనే ఈయన తన ‘లాల్ సింగ్ ఛాధ్ధా’ మూవీ షూటింగ్ ని ఎందుకు నిర్వహించాలనుకున్నాడని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది. తనను సెక్యులర్ గా చెప్పుకునే ఈ నటుడు నిజస్వరూపం ఇదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే..గతంలో.. ఇండియాలో పరమత సహనం లేదని, తన భార్య భయపడుతోందని ఆయన చేసినవ్యాఖ్యలను గుర్తు చేసింది.
అటు- టర్కీలో ఆమిర్ గారి నిర్వాకంపై ఆ మధ్య అనేకమంది నెటిజనులు కూడా ఆడిపోసుకున్నారు. అతనిది హిపోక్రసీ అని దుయ్యబట్టారు. తనను సినిమాల్లో దేశభక్తుడిగా చూపుకుంటూ మరోవైపు పాకిస్థాన్ తో అంటకాగుతున్న టర్కీతో చెట్టపట్టాలు వేసుకుంటున్నాడని వారు ధ్వజమెత్తారు.