‘బాబర్ ఆజామ్ ఐపీఎల్‌లో ఆడాలి’..

|

Aug 14, 2020 | 3:05 PM

బాబర్ ఐపీఎల్‌లో ఆడాలని భావిస్తున్నా. కానీ రాజకీయ కారణాల వల్ల ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ ప్లేయర్స్‌ను అనుమతించరని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తెలిపాడు.

బాబర్ ఆజామ్ ఐపీఎల్‌లో ఆడాలి..
Follow us on

Babar Azam Needs To Play IPL: ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ఫ్యాబ్ ఫోర్ లిస్టులో ఉన్నారు. వీరి అద్భుతమైన ఆటతీరుకు అటు ఫ్యాన్స్, ఇటు దిగ్గజాలు ఇద్దరూ కూడా ప్రశంసలు కురిపిస్తారు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఫ్యాబ్ ఫైవ్ ఉండాలని.. ఆ లిస్టులో పాక్ క్రికెటర్ బాబర్ ఆజామ్ చోటు దక్కించుకుంటాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అన్నాడు. గత కొద్దికాలంగా బాబర్ ఆటతీరు అద్భుతంగా ఉండటమే కాకుండా.. ప్రతీ మ్యాచ్‌కు మెరుగ్గా రాణిస్తూ వస్తున్నాడని నాజర్ హుస్సేన్ ప్రశంసలు కురిపించాడు.

‘బాబర్ ఐపీఎల్‌లో ఆడాలని భావిస్తున్నా. కానీ రాజకీయ కారణాల వల్ల ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ ప్లేయర్స్‌ను అనుమతించరు. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడను. కానీ బాబర్ మాత్రం ఐపీఎల్‌లో ఆడితే బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పటితరం ఆటగాళ్లలో ‘ఫ్యాబ్ ఫైవ్’ లిస్టు ఉండాలి. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ లాంటి దిగ్గజ ప్లేయర్స్ సరసన బాబర్‌ ఆజామ్ కూడా చేరుతాడు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్‌..

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..