పొరపాటున ఈ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేశారో మీ పని గోవిందా.. 6 నకిలీ వెబ్‌సైట్ల పేర్లను ప్రకటించిన పీఐబీ.

|

Dec 19, 2020 | 5:08 PM

సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దర్జాగా డబ్బులు కొట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చలామణీ అవుతోన్న కొన్ని నకిలీ వెబ్‌సైట్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) గుర్తించింది. తాజాగా ఆరు మోసపూరిత వెబ్‌సైట్లను ప్రకటించింది. అవేంటంటే..

పొరపాటున ఈ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేశారో మీ పని గోవిందా.. 6 నకిలీ వెబ్‌సైట్ల పేర్లను ప్రకటించిన పీఐబీ.
Follow us on

Don’t open these 6 websites: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఇళ్లలో పడే దొంగలు ఇప్పుడు ‘నెట్టింట్లో’ పడుతున్నారు. ప్రపంచంలో ఏదో మూలన కూర్చొని మన అకౌంట్‌లలోని డబ్బును కొట్టేస్తున్నారు. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వస్తున్న తరుణంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, భారీ ఎత్తున స్కాలర్ షిప్‌లు అందిస్తామంటూ కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దర్జాగా డబ్బులు కొట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చలామణీ అవుతోన్న కొన్ని నకిలీ వెబ్‌సైట్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) గుర్తించింది. తాజాగా ఆరు మోసపూరిత వెబ్‌సైట్లను ప్రకటించింది. అవేంటంటే..
https://centralexcisegov.in/aboutus.php
https://register-for-your-free-scholarship.blogspot.com/
https://kusmyojna.in/landing/
https://www.kvms.org.in/
https://www.sajks.com/about-us.php
http://register-form-free-tablet.blogspot.com/
ఈ 6 వెబ్ సైట్లు నకిలీవని, వాటితో ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదని, కనుక వాటిని నమ్మి క్లిక్ చేయవద్దని, ఆయా వెబ్ సైట్లలో సమాచారం ఎంటర్ చేయవద్దని పీఐబీ హెచ్చరించింది. ప్రభుత్వం పేరుతో వెబ్‌సైట్లు ఉండడంతో జనాలు తొందరగా ఆకర్షితులవుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటి జోలికి పోకూడదని పీఐబీ సూచించింది.