కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు..శునకాలు మనుషుల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాయి. వాటి విశ్వాసం ఎంత గొప్పదో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే బంగాల్లో జరిగింది. యజమాని ప్రాణాల కోసం ఏకంగా చిరుతతోనే పోరుకు సిద్ధపడి విజయం సాధించింది ఓ బ్రేవ్ డాగ్.
వివరాల్లోకి వెళ్తే.. డార్జిలింగ్‌లో నివశించే అరుణ… నాలుగేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటోంది. దానికి నిక్ నేమ్ ‘టైగర్’ అని పెట్టుకుంది. ఈ నెల 14న రాత్రి వేళ ఇంటి కింద అంతస్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఒక చిరుత అరుణపై దాడి చేసింది. అది గుర్తించిన టైగర్.. వెంటనే ఆ అడవి మృగంతో సమరానికి దిగింది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న టైగర్ ధైర్యాన్ని చూసి చిరుత పారిపోయింది. అరుణ గాయాలతో బయటపడింది. దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. అరుణ ఇంటి పరిసరాల్లో ‘కెమెరా ట్రాప్’లు అమర్చారు.
WB:A pet dog saved life of its owner,Aruna Lama who was attacked by a leopard on Aug 14 in Darjeeling.Aruna’s daughter says,”as my mother was making her way to ground floor of our house she noticed a pair of glowing eyes,then the leopard attacked her but Tiger(pet dog) saved her” pic.twitter.com/JedUyCjGPd
— ANI (@ANI) August 17, 2019