45 ఏళ్లుగా సినిమానే శ్వాసగా, అరుదైన మైలురాయి అందుకున్న మోహన్ బాబు

మంచు భక్తవత్సల నాయుడు..కట్ చేస్తే మోహన్ బాబు. తెలుగు తెరపై అద్భుతమైన పాత్రలు పోషించి కలెక్షన్ కింగ్‌గా రాణించారు.

45 ఏళ్లుగా సినిమానే శ్వాసగా, అరుదైన మైలురాయి అందుకున్న మోహన్ బాబు

మంచు భక్తవత్సల నాయుడు..కట్ చేస్తే మోహన్ బాబు. తెలుగు తెరపై అద్భుతమైన పాత్రలు పోషించి కలెక్షన్ కింగ్‌గా రాణించారు. విలన్‌ అయినా, హీరో అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసినా..మోహన్ బాబుది విభిన్న శైలి. విలక్షణ శైలిలో సంభాషణలు చెప్పి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు మోహన్ బాబు. కాగా నేటితో ఈ మంచు లెజెండ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. 1974లో వచ్చిన కన్నవారి కలలు, అల్లూరి సీతారామరాజు సినిమాలతో ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటివరకు వివిధ పాత్రల్లో 565 సినిమాల్లో నటించిన మోహన్ బాబు…75 చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్నాఫ్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకులను పలుకరించారు. కాగా 45 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తోన్న ఈ దిగ్గజ నటుడికి పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్