గత ఏడాదికిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ.. తిరిగి మళ్లీ బ్యాట్ పట్టాడు. దుబాయిలో జరుగనున్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించనున్న మహీ.. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ సంఘం (జేఎ్‌ససీఏ) స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
గత జూలైలో వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనలే ధోనీ ఆడిన చివరి మ్యాచ్. అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతడు ఐపీఎల్ నేపథ్యంలో మళ్లీ కదన రంగంలోకి దిగనున్నాడు. రెండురోజుల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బౌలర్లు అందుబాటులో లేనందున బౌలింగ్ మెషీన్‌ను ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఐపీఎల్ కోసం గత మార్చిలో చెన్నై జట్టు ఆటగాళ్లతో కలిసి ధోనీ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు. అయితే కరోనా వైర్‌సతో ఐపీఎల్ వాయిదాపడడంతో రాంచీ వెళ్లిపోయారు. అప్పటినుంచి అడపాదడపా సోషల్ మీడియాల్లో మాత్రమే మహీ కనిపించాడు. కాగా..మహీ అంతర్జాతీయ కెరీర్‌పై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఐపీఎల్‌లో ప్రదర్శననుబట్టి కెరీర్‌పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.