చెన్నై చేరుకున్న ధోనీ సేన

|

Aug 14, 2020 | 11:10 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై చేరుకుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్...

చెన్నై చేరుకున్న ధోనీ సేన
Follow us on

CSK Players Arrive : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై చేరుకుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌‌త్యేకంగా శిక్ష‌ణ శిబిరం ఏర్పాటు చేసింది. ఇందు కోసం కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ, సురేశ్ రైనా చెన్నై చేరుకున్నారు. చెపాక్ స్టేడియంలో ఆగ‌స్టు 15 నుంచి 20 వ‌ర‌కు ఆరు రోజుల పాటు దేశీయ ఆట‌గాళ్ల కోసం క్యాంప్ నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 16 మంది దేశీయ ఆట‌గాళ్ల‌లో 13 మంది వ‌ర‌కు ఈ ప్రాక్టీస్‌లో పాల్గొన‌నున్న‌ట్లు ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.

ఈ క్యాంప్ కోసం ధోనీ, రైనా, పియూష్ చావ్లా, దీప‌క్ చాహ‌ర్‌, బ‌రింద‌ర్ శ్రాణ్ శుక్ర‌వారం రాత్రి చెన్నై విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. యూఏఈకి బ‌య‌లుదేర‌క‌ముందే.. ఇక్క‌డ రెండుసార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించనున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్‌తో ఉన్న ధోనీ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఫ్రాంచైజీ త‌లా వ‌చ్చేశాడు అనే కామెంట్‌ను  జోడించారు.