ఆటలోనే కాదు మాటల్లోనూ మంత్రముంది

|

Aug 16, 2020 | 6:27 AM

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. సౌమ్యుడు, మిస్టర్ కూల్.. ఇలా అతడికి ఎన్నో పేర్లు. అయితే అతడిలో చమత్కారంలోనూ కొంత కారం..

ఆటలోనే కాదు మాటల్లోనూ మంత్రముంది
Follow us on

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. సౌమ్యుడు, మిస్టర్ కూల్.. ఇలా అతడికి ఎన్నో పేర్లు. అయితే అతడిలో చమత్కారంలోనూ కొంత కారం.. తీపీ ఎక్కువే అంటారు మహీ గురించి తెలిసిన విమర్శకులు. ఎందుకంటే.. అతడు సందర్భోచితంగా పేల్చే మాటల తూటాలు చాలా బలంగా తగులుతుంటాయి.

జార్ఖండ్ డైనమెట్ తన ఆటతీరుతోనే కాకుండా తన చమత్కారంతోనూ ఆకట్టుకున్నాడు. మీడియాకు చాలా సార్లు సుతిమెత్తగా చురకలంటిస్తుండేవాడు. అయితే ఈ సందర్భంగా ధోనీ పేల్చిన కొన్ని మాటల తూటాలు మీడియా ప్రముఖులు, విమర్శకులు నెట్టింట్లో గుర్తు చేసుకుంటున్నారు.

ఎందుకంటే ఆ మాటల్లో ధ్వని తక్కువగా ఉన్నా.. అర్థం మాత్రం డైనమెట్ కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని అంటారు. ఓ సారి రవిశాస్త్రిపైనే మాటల తూటాలను సంధించాడు. 2007టీ ట్వంటీ ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత ధోనీతో రవిశాస్త్రి.. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వస్తున్న సమయంలో ఇలా అన్నాడు. “మాట్లాడటం మొదలు పెట్టే ముందు క్రిక్‌ఇన్ఫోకి మీరు రాసిన వ్యాసం చదివానని మీకు తప్పక చెప్పాలి. మీరు ఆస్ట్రేలియా ‘గెలుపు గుర్రం’ అని రాశారు. ఇవాళ నేను, మా జట్టు అది తప్పని నిరూపించాం..” అని అనటంతో రవిశాస్త్రి కాస్తా.. షాక్  అయ్యాడు. ఇక మీడియాపైన కూడా అదేస్థాయిలో మెత్తగా చురకలు అంటించేవాడు. 2011ప్రపంచకప్‌ విజయానంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. “ఫుల్‌స్టాప్‌ పెట్టేంత వరకు ఒక వాక్యం ముగిసినట్లు కాదు” అని అన్నారు. దీంతో అప్పుడు మీడియా మొత్తం టీమిండియాను నిందిస్తూ రాసే రాతలకు పులిస్టాప్ పెట్టాయి. ఇలా చాలా సందర్బాల్లో తన మా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించేవాడు మన మిస్టర్ కూల్…