కరోనా ఎఫెక్ట్.. డేటా సైంటిస్టులకు పెరగనున్న డిమాండ్.!

కరోనా తర్వాతి కాలంలో డేటా సైంటిస్టులకు డిమాండ్ భారీగా పెరగనుందని టాలెంట్ స్ప్రింట్ సీఈవో శంతనుపాల్ తెలిపారు. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోనే కాకుండా...

కరోనా ఎఫెక్ట్.. డేటా సైంటిస్టులకు పెరగనున్న డిమాండ్.!

Updated on: Oct 10, 2020 | 3:15 PM

Data Science Jobs: కరోనా తర్వాతి కాలంలో డేటా సైంటిస్టులకు డిమాండ్ భారీగా పెరగనుందని టాలెంట్ స్ప్రింట్ సీఈవో శంతనుపాల్ తెలిపారు. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోనే కాకుండా రిటైల్, హెల్త్‌కేర్‌, సైంటిఫిక్ రిసెర్చ్, అటోమొబైల్, అగ్రికల్చర్ సెక్టార్‌లలో కూడా డేటా సైంటిస్టుల అవసరం బాగా పెరగనుందని నిపుణులు అంటున్నారు.

కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌కు అలవాటు పడుతున్నారు. దీనితో మరింత డేటా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. దానితోనే డేటా సైంటిస్టులకు డిమాండ్ పెరుగుతుందని శంతనుపాల్ అన్నారు. అలాగే తాజాగా ఎడ్‌టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ చేసిన ఓ సర్వేలో ఆగష్టు 2020 చివరికి సుమారు 93,500 డేటా సైన్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉండటం గమనార్హం. అలాగే ఈసారి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బెంగళూరు ముందు వరుసలో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

Also Read: 

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!