ఏపీ హైకోర్టు రోస్టర్‌లో కీలక మార్పులు

ఏపీ హైకోర్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రోస్టర్ విధానంలో కేసుల విచారణలో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి కీలక మార్పులు చేశారు. తాజా మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

  • Rajesh Sharma
  • Publish Date - 3:00 pm, Mon, 2 November 20
ఏపీ హైకోర్టు రోస్టర్‌లో కీలక మార్పులు

Crucial changes in High-court roaster: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్ విధానంలో కీలక మార్పులు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే. మహేశ్వరి. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం వెల్లడించింది. రాజధాని వివాదంపై దాఖలైన కేసులన్నింటినీ ఒక ధర్మాసనానికి అప్పగించారు. అయితే ఈ ధర్మాసనంలో తాజాగా కొన్ని మార్పులు చేశారు.

ఏపీ హైకోర్టులో రోస్టర్ విధానంలో చేసిన కీలక మార్పుల్లో భాగంగా రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో కూడా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. అన్ని బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపే బాధ్యతలను జస్టిస్ కన్నెగంటి లలితకు అప్పగించారు. రెవెన్యూ, భూ సేకరణ కేసులను జస్టిస్ డి. రమేశ్‌కు కేటాయించారు. రోస్టర్ విధానంలో చేసిన మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి కార్యాలయం పేర్కొంది.

ALSO READ: ఐపీఎల్ చివరి దశలో కీలకంగా సన్‌రైజర్స్

ALSO READ: భార్య శవంతో టూవీలర్ జర్నీ.. చివరికి కటకటాల పాలు

ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర

ALSO READ:  పోలవరంపై హైదరాబాద్‌లో కీలకభేటీ