నిమ్స్‌లో కొవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయిల్స్..!

రెండో దశ క్లినికల్ ట్రయిల్స్‌ను ప్రారంభించేందుకు నిమ్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగానూ… 15-60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను వాలంటీర్లుగా ఎంపిక చేస్తున్నారు.

నిమ్స్‌లో కొవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయిల్స్..!
Follow us

|

Updated on: Sep 04, 2020 | 4:38 PM

Second Phase Clinical Trails: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు సెంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనే క్రమంలో… టీకాను తయారు చేసే దిశగా… భారత్​ బయోటెక్​ అడుగులు పడుతున్నాయి. కొవాగ్జిన్​ తొలి విడత క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశలో ఉండగా… రెండో దశ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు రెండో వారంలో ఇవి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిమ్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.

రెండో దశ క్లినికల్ ట్రయిల్స్‌ను ప్రారంభించేందుకు నిమ్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగానూ… 15-60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను వాలంటీర్లుగా ఎంపిక చేస్తున్నారు. వారి నుంచి సేకరించిన రక్త నమూనాలను ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ఢిల్లీలోని ప్రయోగశాలకు పంపిస్తారు. వాటి ఆధారంగా… ఎంపిక చేసిన వాలంటీర్లకు టీకాలు వేస్తారు. కాగా, ప్రస్తుతం నిమ్స్‌లో బూస్టర్ డోసేజ్స్ తో మొదటి దశ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ ముగిశాయి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..