కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల కేసులు.. 2 లక్షల మృతులు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమయింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు.

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల కేసులు.. 2 లక్షల మృతులు..

Edited By:

Updated on: Apr 25, 2020 | 10:53 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమయింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,884,649 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 200,824 మంది ప్రాణాలు కోల్పోగా.. 823,461 మంది కోలుకున్నారు.

భారత్ లో ఇప్పటి వరకు 24,942 కరోనా కేసులు నమోదయ్యాయి. 779 మంది ప్రాణాలు కోల్పోగా, 5,210 మంది కోలుకున్నారు.

Also Read: అక్కడ షాపింగ్ చేయాలంటే మగాళ్లకే పర్మిషన్.. ఎందుకంటే..!