బ్లాక్‌లో ర్యాపిడ్‌ కిట్లు.. తక్షణ ఫలితంతో భారీ డిమాండ్‌!

బ్లాక్‌లో ర్యాపిడ్‌ కిట్లు.. తక్షణ ఫలితంతో భారీ డిమాండ్‌!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. ‘బ్లాక్‌’ లో వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 11:35 AM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. ‘బ్లాక్‌’ లో వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుండదన్న భావనతో చాలామంది యాంటిజెన్‌ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్‌ పెరిగి బ్లాక్‌ అవుతున్నాయి.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కాగా.. తెలంగాణలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు, లేబొరేటరీలకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కేవలం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేసేందుకే  23 ప్రైవేట్‌ లేబొరేటరీలకు, కొన్ని ఆసుపత్రులకు అనుమతి ఉంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాల వెల్లడికి చాలా సమయం పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, లేబొరేటరీలకు కేంద్రం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులకు అనుమతినిచ్చింది. దీనిద్వారా కరోనా నిర్ధారణ అరగంటలోపే జరుగుతోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లకు కొన్ని కంపెనీలు డీలర్ల ద్వారా అక్రమంగా కిట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu