దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,290 మరణాలు సంభవించాయి.

దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు..

Updated on: Sep 16, 2020 | 9:49 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,290 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,20,360కి చేరుకుంది. ఇందులో 9,95,933 యాక్టివ్ కేసులు ఉండగా.. 82,066 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 39,42,361 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇక అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 10 లక్షల 97 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఏపీలో 5,83,925.. తమిళనాడులో 5,14,208.. కర్ణాటకలో 4,75,265 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 20,482 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజు 82,961 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 78.53 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63 శాతంగా ఉంది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

Loading...
Unable to load recommendations.
Follow Us