తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్త ఎన్ని కేసులంటే.!

|

Aug 31, 2020 | 9:27 AM

తెలంగాణలో కరోనా కేసులు తాజాగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది.

తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్త ఎన్ని కేసులంటే.!
Follow us on

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో కరోనా కేసులు తాజాగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. ఇందులో 31,299 యాక్టివ్ కేసులు ఉండగా.. 92,837 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,849 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 9 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 827కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 37,791 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 13,65,582కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 51, జీహెచ్ఎంసీ 368, జగిత్యాల 77, జనగాం 34, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల్ 28, కామారెడ్డి 25, కరీంనగర్ 180, ఖమ్మం 103, ఆసిఫాబాద్ 21, మహబూబ్ నగర్ 40, మహబూబాబాద్ 54, మంచిర్యాల 48, మెదక్ 12, మేడ్చల్ 41, ములుగు 19, నాగర్ కర్నూల్ 36, నల్గొండ 79, నారాయణపేట 1, నిర్మల్ 4, నిజామాబాద్ 94, పెద్దపల్లి 29, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 129, సంగారెడ్డి 37, సిద్ధిపేట 85, సూర్యాపేట 65, వికారాబాద్ 15, వనపర్తి 32, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 94, యదాద్రి భోనగిరిలో 21 కేసులు నమోదయ్యాయి.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!