కరోనా కల్లోలం.. ఒక్క రోజే 67,151 కేసులు, 1059 మరణాలు..

|

Aug 26, 2020 | 10:02 AM

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 67,151 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1059 మరణాలు సంభవించాయి.

కరోనా కల్లోలం.. ఒక్క రోజే 67,151 కేసులు, 1059 మరణాలు..
Follow us on

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 67,151 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1059 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,34,475కి చేరుకుంది. ఇందులో 7,07,267 యాక్టివ్ కేసులు ఉండగా.. 59,449 మంది కరోనాతో మరణించారు. అటు 24,67,759 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఢిల్లీ తప్పితే మిగిలిన అన్నింటిలోనూ రోజుకు 5 వేలుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 76.30 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 1.84 శాతంలో ఉంది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..