Coronavirus New Strain: ‘స్ట్రెయిన్’ వైరస్ ఎఫెక్ట్.. ఆ దేశాల్లో మళ్లీ లాక్ డౌన్.?

|

Jan 05, 2021 | 10:12 PM

Coronavirus New Strain: ప్రపంచానికి అసలేమైంది.? ఒకవైపు కరోనా వ్యాప్తి క్రమేపీ తగ్గుముఖం పడుతోందని అనుకునేలోపే.. కొత్తరకం కరోనా ..

Coronavirus New Strain: స్ట్రెయిన్ వైరస్ ఎఫెక్ట్.. ఆ దేశాల్లో మళ్లీ లాక్ డౌన్.?
Follow us on

Coronavirus New Strain: ప్రపంచానికి అసలేమైంది.? ఒకవైపు కరోనా వ్యాప్తి క్రమేపీ తగ్గుముఖం పడుతోందని అనుకునేలోపే.. కొత్తరకం కరోనా ‘స్ట్రెయిన్’ ప్రపంచదేశాలను మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తోంది. యూకేలో వెలుగు చూసిన ఈ ‘స్ట్రెయిన్’ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. సాధారణ కరోనా కంటే ‘స్ట్రెయిన్’ వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండగా.. రోజురోజుకూ పెరుగుతోన్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దీనితో మరోసారి లాక్ డౌనే శరణ్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం కొత్త ‘స్ట్రెయిన్; కట్టడికి కఠినతరమైన లాక్ డౌన్ విధించగా.. మరిన్ని దేశాలు అదే బాట పట్టనున్నాయి.

జర్మనీలో జనవరి 10 వరకు నిత్యావసరాల మినహా అన్ని వాణిజ్య సంస్థలను మూసి వేయాలని ఆదేశించడమే కాకుండా.. యూకే విమానాలపై అక్కడి ప్రభుత్వం నిషేదాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే స్కాట్లాండ్ ప్రధాని నికోలా మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు నిబంధనలు అమలులోకి వస్తాయని.. ప్రజలందరూ కూడా ఇంటి వద్దనే ఉండాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, ప్రార్ధనా మందిరాలు, జిమ్‌లు మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఇక నెదర్లాండ్స్ ప్రభుత్వం జనవరి 19 వరకు పాక్షిక లాక్ డౌన్ ప్రకటించగా.. ఆస్ట్రియా జనవరి 24 వరకు రెస్టారంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్ని మూసేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా, పోలాండ్‌లో జనవరి 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.