టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగాల్లో కోత..!

|

May 23, 2020 | 5:50 PM

కరోనా వైరస్ ప్రభావం మరో ఐటీ దిగ్గజం IBM ఉద్యోగులపై పడింది. ఆర్థిక వ్యయాన్ని తగ్గుంచుకునే మార్గంలో ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సంస్థ తెలిపింది. భారత సంతతికి చెందిన అరవింద్‌ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో చేరింది. కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM) ఉద్యోగాల కోతకు నిర్ణియించింది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాణిజ్యంతో సంస్థ తీవ్రంగా ఆర్థిక ఒడిదొడుకులను […]

టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగాల్లో కోత..!
Follow us on

కరోనా వైరస్ ప్రభావం మరో ఐటీ దిగ్గజం IBM ఉద్యోగులపై పడింది. ఆర్థిక వ్యయాన్ని తగ్గుంచుకునే మార్గంలో ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సంస్థ తెలిపింది. భారత సంతతికి చెందిన అరవింద్‌ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో చేరింది.
కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM) ఉద్యోగాల కోతకు నిర్ణియించింది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాణిజ్యంతో సంస్థ తీవ్రంగా ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఇందులో భాగంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల్లో కోత విధించాలని నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. ఈ నిర్ణయం ఉద్యోగులకి బాధ కలగిస్తుందని సంస్థ గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబిఎం సబ్సిడీ వైద్య కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా నిర్ణయంతో ఎంతమంది ప్రభావితమవుతున్నారో ఐబీఎం వెల్లడించలేదు. కానీ వేలాది మంది ఉద్యోగాలపై ఈ ప్రభావం పడుతుందని మీడియా నివేదికలు తెలిపాయి. అమెరికాలో కనీసం ఐదు రాష్ట్రాల్లో వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. వీరిలో భారతదేశంలో కొన్ని వందల ఉద్యోగులు కూడా ప్రభావితంకానున్నారని సమాచారం. అయితే, బాధిత ఉద్యోగులకు మూడు నెలల వేతనాన్ని చెల్లించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.