వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.25 లక్షలు..

ప్రపంచవ్యాప్తంగా 11,049,997 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 525,279 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 6,187,338 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.25 లక్షలు..

Updated on: Jul 03, 2020 | 9:10 PM

ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. అటు శాస్త్రవేత్తలు దీనికి వ్యాక్సిన్ కనుగొనేందుకు సర్వశక్తులు ఒడ్డిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11,049,997 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 525,279 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 6,187,338 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 5155 కరోనా మరణాలు సంభవించాయి.

ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడే అత్యధిక కేసులు(2,854,976), మరణాలు(1,31,663) సంభవించాయి. బ్రెజిల్, రష్యా, భారత్‌లలో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తుండటంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అయితే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయిందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఇక అగ్రరాజ్యం తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు బ్రెజిల్‌లో నమోదయ్యాయి. అక్కడ 1,502,424 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 62,045 మంది వైరస్‌తో మరణించారు. ఆ తర్వాత రష్యాలో 667,883 పాజిటివ్ కేసులు, 9,859 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 633,381 నమోదు కాగా, మృతుల సంఖ్య 18,320కి చేరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us