క‌ష్టకాలంలో కేంద్ర ప్ర‌భుత్వ ఆస‌రా..కేజీ బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2

కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీన్ని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కూడా దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్‌తో ప్రక‌టించింది. లాక్‌డౌన్ ప్ర‌భావంతో దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద‌వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉన్న నేపథ్యంలో స‌ర్కార్..వాటికి ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలకు కేజీ బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 కే స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో వ‌ర‌ల్డ్ లోనే అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్‌కు కేంద్ర స‌ర్కార్ […]

క‌ష్టకాలంలో కేంద్ర ప్ర‌భుత్వ ఆస‌రా..కేజీ బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2
Follow us

|

Updated on: Mar 25, 2020 | 4:54 PM

కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీన్ని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కూడా దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్‌తో ప్రక‌టించింది. లాక్‌డౌన్ ప్ర‌భావంతో దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద‌వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉన్న నేపథ్యంలో స‌ర్కార్..వాటికి ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలకు కేజీ బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 కే స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలో వ‌ర‌ల్డ్ లోనే అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్‌కు కేంద్ర స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మూడు నెలల పాటు ఈ సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలను అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తాజా ప్రెస్ మీట్ లో స్ప‌ష్టం చేశారు. డైలీ లేబ‌ర్, రోజువారీ జీత‌భ‌త్యాల‌పై కాలాన్నీ వెళ్ల‌దీసేవాళ్ల‌కి ఈ నిర్ణ‌యం ఎంతో ఉప‌యోగ‌కారి కానుంది. దాదాపు 80 కోట్ల మందికి నెలకు 7 కిలోల రేషన్ ను కేంద్రం అందించ‌నుంది.

Latest Articles