Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9536 పాజిటివ్ కేసులు, 66 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,67,123కి చేరింది. ఇందులో 95,072 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,67,139 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4912కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1414 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,99,826 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 521, చిత్తూరులో 957, తూర్పు గోదావరిలో 1414, గుంటూరులో 792, కడపలో 585, కృష్ణాలో 397, కర్నూలులో 441, నెల్లూరులో 844, ప్రకాశంలో 788, శ్రీకాకుళంలో 733, విశాఖలో 415, విజయనగరంలో 573, పశ్చిమ గోదావరిలో 1076 కేసులు నమోదయ్యాయి.
Over a 100 games with one of the best Australian sides, and now considered among the most knowledgeable coaches in the cricketing world.
Here’s everything you need to know about our Head Coach, Simon Katich. #PlayBold #IPL2020 #WeAreChallengers pic.twitter.com/kGODqCSotu
— Royal Challengers Bangalore (@RCBTweets) September 13, 2020