
Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 20,021 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,07,871 చేరుకుంది. ఇందులో 2,77,301 యాక్టివ్ కేసులు ఉండగా.. 97,82,669 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 279 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,47,901 కరోనా మరణాలు సంభవించాయి.
అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో శనివారం 21,131 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.72 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.83 శాతానికి రికవరీ రేటు చేరిందంది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/vrgy6bJmJc
— ICMR (@ICMRDELHI) December 28, 2020
Also Read:
హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!
కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.!
ఏపీలో కొత్త ‘స్ట్రెయిన్’ కలవరం.. యూకే నుంచి వచ్చినవారిలో నలుగురికి పాజిటివ్.!