కంగ్రాచ్యులేషన్స్ ధోనీ… నీవు స్ఫూర్తిదాయకం

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అభినందలు వెళ్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో...

కంగ్రాచ్యులేషన్స్ ధోనీ... నీవు స్ఫూర్తిదాయకం

Updated on: Aug 16, 2020 | 5:04 AM

CM Jagan Tweets about Dhoni’s Retirement : టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అభినందలు వెళ్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలుపుతు ట్వీట్ చేశారు.

కంగ్రాచ్యులేషన్స్ ధోనీ అంటూ ఈ ఝార్ఖండ్ డైనమైట్‌ను అభినందించారు. మహోజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకున్నావంటూ ప్రశంసించారు. నువ్వు సాధించిన ప్రాభవం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులకు ధోనీ ఘనతలు ప్రేరణ కలిగిస్తాయని వివరించారు. ధోనీ భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ తన  ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Follow Us