ముందు జగన్.. అనంతరం చంద్రబాబు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభ కానున్నాయి. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదటి రోజు కావడంతో సభలో తొలుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు […]

ముందు జగన్.. అనంతరం చంద్రబాబు..

Updated on: Jun 12, 2019 | 9:15 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభ కానున్నాయి. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదటి రోజు కావడంతో సభలో తొలుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాతి రోజు బుధవారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us