Bigg Boss Telugu 4 Finale : బాస్ చేతుల మీదగా ‘బిగ్ బాస్’ విజేతకు ట్రోఫీ..బుల్లి తెర రికార్డులు బద్దలేగా !

బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించే సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ టైటిల్ ఇవ్వాలంటే ఆ రేంజ్ ‌చీఫ్ గెస్ట్ ఉండాల్సిందే. అవును అందుకే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా

Bigg Boss Telugu 4 Finale : బాస్ చేతుల మీదగా బిగ్ బాస్ విజేతకు ట్రోఫీ..బుల్లి తెర రికార్డులు బద్దలేగా !

Updated on: Dec 20, 2020 | 5:37 PM

బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించే సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ టైటిల్ ఇవ్వాలంటే ఆ రేంజ్ ‌చీఫ్ గెస్ట్ ఉండాల్సిందే. అవును అందుకే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా బిగ్ బాస్ విన్నర్‌కు ట్రోఫి ఇప్పించబోతున్నారు. అందుకోసం ఇప్పటికే చిరంజీవి అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ చేరుకున్నారు. కాగా మరికొద్ది సేపట్లో మెగాస్టార్ విజేతను ప్రకటించనున్నారు. కాగా సాయంత్రం ఆరుగంటల నుంచి ఫినాలే ఎఫిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటివరకు చీఫ్ గెస్ట్ విషయంలో చాలా పేర్లు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్‌గా మెగాస్టార్ వైపే మొగ్గు చూపారు నిర్వాహకులు.

ఇక బిగ్ బాస్ విజేత విషయంలో మరికొద్ది సేపట్లో సస్పెన్స్ వీడిపోతుంది. కాగా ఇప్పటివరకు అందుతోన్న లీకుల ప్రకారం అభిజీత్ విన్నర్ అని ప్రచారం జరుగుతోంది. ప్రేక్షకుల నుంచి అతడికి ఓటింగ్‌లో ఏకపక్ష మద్దతు లభించినట్టు సమాచారం. ఇక మెగాస్టార్ చేతుల మీదగా టైటిల్ అంటే అది విన్నర్ లైఫ్‌లో బెస్ట్ మెమరీగా నిలిచిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

Also Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

Follow Us