‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు కలవరపెడుతున్నాయి. నటీనటులు, టెక్నిషియన్ల అకాల మరణాలతో పాటు మంచి భవిష్యత్ ఉన్న యువ తారల ఆత్మహత్యలు, కరోనా కాటు లాంటి ఆకస్మిక పరిణామాలతో సినీ లోకం ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది.

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్

Updated on: Sep 09, 2020 | 1:58 PM

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు కలవరపెడుతున్నాయి. నటీనటులు, టెక్నిషియన్ల అకాల మరణాలతో పాటు మంచి భవిష్యత్ ఉన్న యువ తారల ఆత్మహత్యలు, కరోనా కాటు లాంటి ఆకస్మిక పరిణామాలతో సినీ లోకం ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. మంగళవారం టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త నుంచి తేరుకోకముందే ఈ రోజు ఉదయం మౌనరాగం సీరియల్ నటి శ్రావణి సూసైడ్ చేసుకున్న వార్త షాక్ కి గురి చేసింది. ఇంతలోనే ‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మ బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారనే మరో విషాదకర వార్త బయటకొచ్చింది.

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సీనియర్ నటి సురేఖా సిక్రి. ప్రస్తుతం ఈమె వయసు 75 సంవత్సరాలు. నిన్న అనారోగ్యం పాలైన ఆమెకు రాత్రి సమయంలో ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే ముంబై లోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అదిస్తున్నారు. కాగా ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడం ఇది రెండోసారి అని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది సురేఖా సిక్రి. చివరగా ఆమె నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో జాన్వీ కపూర్‌తో కలిసి కనిపించింది. జాతీయ ఉత్తమ సహాయ నటిగానూ అవార్డు అందుకున్నారు సురేఖా సిక్రి.

 

Also Read :

కొండెక్కిన చికెన్ ధరలు

పుట్టినరోజు నాడే యువతి ఆత్మహత్య, రీజన్ ఏంటంటే

Loading...
Unable to load recommendations.
Follow Us