కొండెక్కిన చికెన్ ధరలు.. కొనాలంటే జేబులు చిల్లే..!

మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ లో రోజురోజుకూ చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. గత రెండు వారాలుగా బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ. 400 ఉండగా.. ఈ ఆదివారం నుంచి అది కాస్తా రూ. 500కి చేరింది. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. లాక్‌డౌన్ ముందు కిలో చికెన్ కేవలం రూ. 50 మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత పౌల్ట్రీ ప్రొడక్షన్ ఆగిపోవడం, […]

  • Publish Date - 3:51 pm, Mon, 25 May 20
కొండెక్కిన చికెన్ ధరలు.. కొనాలంటే జేబులు చిల్లే..!

మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ లో రోజురోజుకూ చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. గత రెండు వారాలుగా బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ. 400 ఉండగా.. ఈ ఆదివారం నుంచి అది కాస్తా రూ. 500కి చేరింది. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. లాక్‌డౌన్ ముందు కిలో చికెన్ కేవలం రూ. 50 మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత పౌల్ట్రీ ప్రొడక్షన్ ఆగిపోవడం, సమ్మర్ మొదలవడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఒక్క బోన్ లెస్ చికెన్ మాత్రమే కాదు స్కిన్ లెస్ చికెన్ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. విపరీతమైన ఎండలు కారణంగా ఉత్పత్తి పెద్దగా లేకపోవడం, అదే విధంగా హోటల్స్, రెస్టారెంట్లు మూసి ఉండటంతో చికెన్ సేల్స్ 60 శాతానికి పడిపోయాయి. అటు మటన్ ధరలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. మొన్నటివరకు కిలో మటన్ రూ. 1000కి విక్రయించారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు అధిక ధరలకు మటన్ అమ్ముతున్న షాపులపై రైడ్ చేస్తుండటంతో.. అది కాస్తా కిలో రూ.700కి చేశారు.